సాక్షి డిజిటల్ న్యూస్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ రిపోర్టర్ నటరాజ్ గవర్నమెంట్ జనవరి 28 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ లో నిర్వహించడం జరిగింది.ఈ ధర్నాలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండేళ్లు దాటిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించ కుండా, ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోకుండా వారిని అరి గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య గారితో కలసి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ పాల్గొనటం జరిగింది మరియు స్థానిక కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్,బిజెపి కన్వీనర్ విజయానంద్,జిల్లా ట్రెజరర్ నాగభూషణం రెడ్డి, వియజరామరాజు, స్వరూప, ప్రతీక్ జైన్ గార్లు మరియు తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనటం జరిగింది.
