తంబళ్లపల్లె మల్లయ్య కొండ సేవకు టీడీపీ నేతలు కలిసి నడుద్దాం.

సాక్షి డిజిటల్ న్యూస్ :28 జనవరి 2026 తంబాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు(రాము) తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండ లో జరిగే మహాశివరాత్రి పర్వదినాన తరలివచ్చే భక్తులకు వేలాది మంది భక్తులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా సేవ చేద్దామని ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని టిడిపి నాయకులు సమావేశమై మహాశివరాత్రి జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతి టిడిపి నాయకుడు, కార్యకర్త ప్రజా సేవకు అంకితం కావాలని బ్రహ్మోత్సవాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, పరిశీలకుడు దినేష్ రెడ్డి, ఇతర టిడిపి అధినాయకులకు ఆహ్వానాలు పంపుతున్నామని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ హాజరై మల్లయ్య కొండ ప్రతిష్ట ఇనుమడింప చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.