తంబళ్లపల్లె తాసిల్దార్ కు ఘనంగా సన్మానం.

సాక్షి డిజిటల్ న్యూస్ :28 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ( రాము), తంబళ్లపల్లె తాసిల్దార్ మండలంలో ఏపీఐఐసీ భూముల సేకరణ, భూముల రీ సర్వే సమస్యల పరిష్కారం, గ్రీవెన్స్ డేలో రైతుల సమస్యలపై స్పందించిన తీరుపై ఆయనకు గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నుండి ప్రశంసాపత్రం అందుకున్నారు. మంగళవారం స్థానిక టిడిపి నేతలు తాసిల్దారు శ్రీనివాసులను ఘనంగా సన్మానించి మండలంలో ఆయన చేస్తున్న రెవెన్యూ సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో రైతుల భూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని కోరారు. అదేవిధంగా ఉత్తమ విఆర్ఓ, సర్వేయర్ గా ఎంపికైన ఎద్దుల వారి పల్లె వీఆర్వో వెంకటేష్, సర్వేర్ అనిల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, వెంకటరమణ, నరేంద్ర నాయుడు, వెంకట్ రెడ్డి, రామచంద్ర, అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.