డి.ఆర్.ఓ.గణేష్ కు సమ్మె నోటీస్ ఇచ్చిన సిపిఐ

★ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి - హనుమకొండ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ కార్మికులకు పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28, వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు, హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సిపిఐ ఆధ్వర్యం లో 12 ఫిబ్రవరి 2026 దేశవ్యాప్త సమ్మె లో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాను నిర్వహిస్తున్నామని సందర్భంలో డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ (డి.ఆర్.ఓ) వై.వి గణేష్ కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు సామాన్యుల భూములను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశా రని,ఫలితంగా కేంద్రం ప్రభుత్వం వెనక్కితగ్గాల్సి వచ్చిం దని, రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సి వచ్చిం దని గుర్తుచేశారు. విత్తన, విద్యుత్ సవరణ బిల్లులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను మార్చి, గాంధీ పేరును మార్చి వివిజి రాంజి చట్టం 2025 తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ / ప్రధాన కార్యదర్శి ధర్ముల రామ్మూర్తి జక్కు రాజు గౌడ్ వారిద్దరు మాట్లాడుతూ .. అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను సంపూర్ణంగా రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు. బ్రిటీష్ ప్రభుత్వంలో కార్మికులు అనేక ఉద్యమాలు చేసి 1923 లోనే ప్రమాద నష్టపరిహార చట్టం సాధించుకున్నారని, ఈ చట్టం ఇప్పటికీ అమలవుతున్న చట్టాలలో ఒక్కటిగా ఉన్నదన్నారు. బి.జె.పి పాలనలో ప్రజల ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని, సామాన్య ప్రజాస్వామ్య హక్కులపై దాడులు జరుగుతున్నాయని, విద్వేషపూరిత ప్రచారాల నేపథ్యంలో సంఘాలను ఏర్పటుచేసుకునే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. సమ్మె, నిరస నలు తెలియజేసే హక్కును కూడా బి.జె.పి. ప్రభుత్వం అణచివేస్తుందని విమర్శించారు. ఆదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని లేదా కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బీ.కే ఎం.యు. జిల్లా అధ్యక్షులు మునగాల బిక్షపతి, ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా ఆఫీస్ బేరర్ రసమల్ల కుమార్, వెంకటేష్, రసమల్ల దీన మరియు తదితరులు పాల్గొన్నారు.