సాక్షి డిజిటల్ న్యూస్ 28 జనవరి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) కేంద్ర ప్రభుత్వం జి.ఆర్.ఎ.ఎం.జి బిల్లును ఉపసంహరించు కొని, ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, సిపిఎం మండల నాయకురాలు మల్లెల నాగమణి లు డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును “పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన” గా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పినిరెడ్డిగూడెం గ్రామ సభలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీ ల తో కలిసి పంచాయతీ కార్యదర్శి జి లలిత, సర్పంచ్ కేలోత్ వీరన్న లకు మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విధానం తో వ్యవసాయ పనులు ఉధృతంగా వున్న సమయంలో 60 రోజుల వరకు ఉపాధిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వాలను అనుమతిస్తున్న నిబంధన వల్ల అత్యంత అవసరమైన కాలంలో గ్రామీణ కుటుంబాలకు పనులను నిరాకరిస్తూ, వారు భూస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని, పని ప్రదేశాల్లో డిజిటల్ హాజరును తప్పనిసరి చేయడం వల్ల పని నష్టం, వారి హక్కులు తిరస్కరించడం వంటి అనేక ఇబ్బందులు కార్మికులకు తలెత్తి,నిధులను అందచేసే విధానంలో ప్రతిపాదిత మార్పును తీసుకురావడం ప్రధానంగా ఆందోళన కలిగిస్తోందని అన్నారు . ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బి. కొండల్ రావు, వార్డు సభ్యులు జి.సీతారాం, బి ఝాన్సీ,ఎన్. నర్సింహ నాయక్, పి. బిక్షపతి, నాయకులు వి. పద్మ, కే. బాల, వి. వీరభద్రం, యం.కొండయ్య, ఉపాధీ కూలీ లు వెంకన్న, అలివేలు, బాగ్యామ్మ, నారాయణ, వెంకన్న, లాల్ సింగ్, సతీష్, బిక్షం, పుల్లయ్య,భద్రు, సాయి లు ఉన్నారు…