జిల్లా స్థాయి ఉత్తమ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు

★పాడేరులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ మండల ఇంజనీరింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న మాణిక్యం ★జిల్లా ఉత్తమ గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ గా కలెక్టర్ నుండి ప్రశంస పత్రం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ పారయ్య ★జిల్లా ఉత్తమ సర్వ శిక్ష(ఎంఐసి) కలెక్టర్ నుంచి పత్రాన్ని తీసుకుంటున్న వెంకటరమణ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి28, జి.మాడుగుల: ప్రభుత్వ విధులు పట్ల అంకితభావంతో సేవలందించిన వివిధ శాఖల అధికారులకు,సిబ్బందికి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా స్థాయి ఉత్తమ మండల ఇంజనీరింగ్ అధికారిగా సమిరెడ్డి మాణిక్యంకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అలాగే గురుకులం కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న పారయ్య కు ఉత్తమ జిల్లా గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ గా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. జిల్లా ఉత్తమ సర్వ శిక్ష (ఎంఐసి ) స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న వి వెంకటరమణకు కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వీరిని తోటి అధికార సిబ్బంది ప్రశంసించారు.