సాక్షి డిజిటల్ న్యూస్ 28 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, రాష్ట్రంలోనే అత్యధిక నిధులు 62.5 కోట్లు జగిత్యాలకు మంజూరు అయ్యాయి సీనియర్ నాయకులు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలో సరైన మాస్టర్ ప్లాన్ లేక లేఅవుట్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారు గత అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణం ఎల్ ఎల్ గార్డెన్ దగ్గర కనీస రోడ్డు సౌకర్యం కోసం ఒక కోటి రూపాయలతో సీసీ రోడ్డు కు భూమి పూజ చేస్తే సీనియర్ నాయకులు దాన్ని పరిశీలించి కల్వర్టులేదని రోడ్డు వెడల్పు సరిగా వేస్తలేరని విమర్శలు చేసి చివరకు అభివృద్ధికి అడ్డంపడ్డారు. ధర్మసముద్రం నుండి చింతకుంట వరకు కాలువలు కబ్జాకు గురైంది ఎవరి హయంలో అని ప్రజలందరికీ తెలుసు. విమర్శ కోసం కాదు ప్రజలకు వివరణ కోసం చెప్తున్నా అన్నారు. సీనియర్ నాయకులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని పరిశీలించి నాపై విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా, కోరుట్ల మెట్పల్లి ధర్మపురి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఇంకా పూర్తి కాలేదు. ఇది రాష్ట్రస్థాయి సమస్య జగిత్యాలలో మాత్రమే పూర్తయి ఇక్కడ ప్రారంభించుకున్నాం. బీట్ బజార్ ప్రాంత రైతులు గంగపుత్రులు,జగిత్యాల రిటైల్ హోల్ సేల్ వ్యాపారస్తులు అందరితో మాట్లాడడం జరిగింది జిల్లా స్థాయి అధికారులతో సైతం మార్కెట్ ప్రారంభం గురించి చర్చించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంట్రాక్టర్ కు 9 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.సీనియర్ నాయకులు ఎలాంటి ప్రాథమిక సమాచారం లేకుండా ఇష్టారీతిన విమర్శలు చేస్తూ ప్రభుత్వం పై నా పై బురద జల్లే ప్రయత్నం చేస్తూ వారి హోదాను వారే దిగజార్చుకుంటున్నారు.వారి పై నాకు గౌరవం ఉంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎమ్మెల్యేగా ఉండి యావర్ రోడ్డును 900 మీటర్ల మేర 100 ఫీట్ల వెడల్పు చేయడం జరిగింది యావర్ రోడ్డు విస్తరణ కు పూర్తిగా కట్టుబడి ఉన్న .అసత్య ప్రచారాలు ఆరోపణలు ప్రజలు నమ్మరు సీనియర్ నాయకులు గతంలో రోడ్ల మంత్రిగా ఉండి అనంతారం బ్రిడ్జికి శంకుస్థాపన చేసి శిలాఫలకం గాలికి వదిలేశారు, పట్టణంలో 14 జోన్ల మార్పు చేయక అనుమతులు రాక ప్రజలు ఇబ్బంది పడ్డారు.ధరూర్ తాటిపల్లి బైపాస్ రోడ్డు రైల్వే గేట్ సమస్య తో 10ఏండ్లు మూతపడింది. రైతు బజార్ పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. గొల్లపల్లి రోడ్డు విస్తరణ చేస్తే దానికి అడ్డం పడ్డారు. పట్టణంలో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మాత్రమే తీసుకువస్తే ధర్నాలు చేసి రైతులను రెచ్చగొట్టి అభివృద్ధికి అడ్డం పడ్డారు. నా కృషితోనే యావర్ రోడ్డు 100 ఫీట్లు జీవో తీసుకురావడం జరిగింది.ఇప్పటి నిర్మాణాలు చూస్తే అర్థమవుతుంది. నూక పల్లి ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేసి ఎలాంటి పూరోగతి లేకుండా మూలకు పడ్డాయి. కవిత గారి సహకారంతో 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు తో నూక పల్లి ఇందిరమ్మ కాలనీకి కొత్త కళ వచ్చింది 34కోట్ల తో మౌలిక సదుపాయాలు కల్పన చేయటం జరిగింది
కవిత ఓటమికి నేను కారణమంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారూ ఒకరి ఓటమి చూసి సంబరపడే నైజం కాదు నాది ముఖ్యమంత్రి బిడ్డ ను ఓడించేంత కుతంత్ర వాదిని కాదు. అభివ్రుద్ది మాత్రమే నా లక్ష్యం
జగిత్యాల అభివృద్ధి పేరిట సొంత లాభం స్వలాభం పొందుతున్నారని విమర్శలు చేస్తున్నారు సీనియర్.సీనియర్ నాయకుల వద్ద వారి దగ్గరీ కాంట్రాక్టర్లు అనేకమంది టెండర్లు వేశారు పనులు మాత్రం చేయట్లేదు అలాంటి వారితో పనులు చేసి జగిత్యాల అభివృద్ధికి సహకరించండి. వారు కమిషన్లు ఇస్తే తీసుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.నాకు అన్నివిధాలుగా ఆర్థికంగా మంచిగా ఉన్నా. గత 30 ఏళ్లుగా సాయిరాం కన్స్ట్రక్షన్స్ పనులు చేస్తుంది.కోనసీమ కన్స్ట్రక్షన్స్ వారు ఎన్నో పనులు చేశారు వారు ఎవరి మనిషి అని అందరికీ తెలుసు అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా విస్తృతంగా సేవ చేయడానికి నాణ్యమైన పనులు చేపట్టడానికి ఎక్కడా లేనివిధంగా 4,500 నిర్మాణం కోసం ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్న
త్వరలోనే ధర్మపురి రోడ్డులో గంగపుత్రుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్ కింద మున్సిపల్ ద్వారా వారికి షాపులు వేయిస్తాను అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ అవినీతిమయం అని సీనియర్ నాయకులు అంటున్నారు. అవినీతి చేసిన అధికారులపై ఏసీబీ దాడులు విజిలెన్స్ దాడులు జరిగి అవినీతి అధికారులు జైలుకు వెళ్లారు. కొందరు సస్పెండ్ అయ్యారు. నేను ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉంటే నాకు అవినీతితో సంబంధం ఉంటే వారు జైలుకు వెళ్లేవారా నాకు సంబంధం లేదు కనుకనే వారు జైలుకు వెళ్లారు అవినీతి అధికారులు. ప్రజలకు తెలుసు కాబట్టే అన్ని వార్డుల్లో మెజార్టీ ఇచ్చారు. చిన్నచిన్న కాంట్రాక్టర్లు పనిచేయడానికి 15 ఫైనాన్స్, జనరల్ ఫండ్ ఉన్నాయి.యు ఐ డి ఎఫ్ స్కీమ్ నిబంధనల ప్రకారం 5 కోట్ల పైన మాత్రమే కాంట్రాక్టర్ లు టెండర్ వేసుకోవచ్చు అని అన్నారు. రాయికల్ జగిత్యాల పట్టణ అభివృద్ధికి టెండర్ లు ఇంకా ఆన్లైన్లో తెరిచి ఉన్నాయి సీనియర్ నాయకులు మీ దగ్గర వారితో టెండర్ వేయించి , పనులు పూర్తి చేసి జగిత్యాల అభివృద్ధికి మీ వంతుగా కృషి చేయండి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం అడువల జ్యోతి లక్ష్మణ్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గట్టు సతీష్, దామోదర్ రావు, జిలానీ, దుమాల రాజ్ కుమార్, జగిత్యాల పట్టణ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.