చోడవరం ఎక్సైజ్ కార్యాలయంలో బహిరంగ వేలం

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి జనవరి 28. చోడవరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2009 నుంచి 2019 మధ్యకాలంలో నమోదైన వివిధ గంజాయి కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను గురువారం (జనవరి 29) బహిరంగ వేలం వేయనున్నారు అని చోడవరం ఎక్సైజ్ సీఐ పాపు నాయుడు విలేకరులకు తెలియజేశారు. ఈ వేలాన్ని విశాఖపట్నం డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మొత్తం ఐదు మోటార్‌ సైకిళ్లు, కార్లు ఈ వేలంలో విక్రయించనున్నారు. ఆసక్తి గల ఎవరైనా నిర్ణీత ప్రవేశ రుసుము చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అత్యధిక ధర పాడిన వారికి వాహనాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో వాహనం దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఖరారైన ధరతో పాటు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి రుసుము చెల్లించిన అనంతరం వాహనాలను అప్పగిస్తామని తెలిపారు. వేలంలో పాల్గొని వాహనం కొనుగోలు చేయని వారికి ప్రవేశ రుసుము తిరిగి చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు.మరిన్ని వివరాలు మరియు వాహనాల పరిశీలన కోసం చోడవరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయాన్ని పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.