చెరువు కట్టపై నాటిన ఈత మొక్కల పీకివేత.

★బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ★గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు బోడపట్ల సతీష్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న ), పాలేరు నియోజకవర్గం లోని తిరుమలాయ పాలెం మండలం, దమ్మాయిగూడెం గ్రామం లో గ్రామ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గతంలో చెరువు కట్ట వెంట నాటిన ఈత చెట్ల మొక్కలను కొందరు వ్యక్తులు పీకివేయడం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో చెరువుకట్టపై నాటిన ఈత మొక్కలను పీకి వేయటంతో చర్చనీయాంశంగా మారింది. ఈ మొక్కలను దమ్మాయిగూడెం గౌడ సంఘం సభ్యులు గ్రామ అభివృద్ధి పచ్చదనం కోసం సామూహికంగా నాటినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. చెరువు కట్ట బలంగా ఉండేందుకు, భూక్షయం నివారించేందుకు మరియు పర్యావరణ సమతుల్యత కోసం ఈత మొక్కలు ఉపయోగపడతాయని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గౌడ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఇటీవల కొందరు ఉద్దేశ పూర్వకంగా ఆ మొక్కలను తొలగించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే చర్య. పర్యావరణానికి హానికరమైన పని” అని గౌడ సంఘం నాయకులు అన్నారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు. ఈ విషయంపై దమ్మాయిగూడెం ఓ రాజకీయ నాయకున్ని వివరణ కోరగా అవి చెత్త పిచ్చి ముక్కలు గా కనిపిస్తున్నాయని తొలగించడం జరిగిందని తెలపడంతో రిపోర్టర్ ఆ మొక్కలు గత ఐదు సంవత్సరాల క్రితమే వేయడం జరిగిందని అవి చిన్న మొక్కలని మీకు కనిపించడం లేదని వివరణ కోరగా అతను సరైన సమాధానం చెప్పలేదు.