సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 మంచిర్యాల జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్, గోలేటి వర్క్ షాప్, స్టోర్స్ యందు తెలంగాణ బొగ్గుఖని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిరిశెట్టి సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మంగీలాల్, పిట్ సెక్రటరీ వర్క్ షాప్ గాజువేణి శ్రీనివాస్, స్టోర్ పిట్ సెక్రటరీ గణపతి, రమేష్, లక్ష్మీనారాయణ , రసూల్, వెంకటేశ్వర్లు, వైకుంఠం, చిలుకు భాయి, పద్మ, మంజుల, వెంకటస్వామి, కనకయ్య, కార్మికులు పాల్గొన్నారు.