సాక్షి డిజిటల్ న్యూస్ సిద్ధవటం జనవరి 28 కడప జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ఆర్సిపి నీ గ్రామ కమిటీల ద్వారానే బలోపేతం చేస్తామని మాజీ జెడ్పి చైర్ పర్సన్ ఇరగమరెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు మండలం లోని పెద్దపల్లి గ్రామపంచాయతీ కాశిరెడ్డి నాయన ఆలయ సమీపంలో మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి రచ్చబండ కార్యక్రమం మండల పరిశీలకులు కూండ్ల ఓబుల్ రెడ్డి అధ్యక్షతన ఏ కుల రాజేశ్వరి రెడ్డి, కెవి సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాల్లో వంద శాతం పూర్తిచేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో మూడు లక్షల మూడు వేల కోట్లు అప్పు చేసి ఏ పథకాలను అమలు చేయలేదు అని విమర్శించారు 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమని దానిని ఎవరు ఆపలేరు అని అన్నారు ప్రతి గ్రామం నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా కమిటీని ఏర్పాటు చేస్తాము అని అన్నారు ఈ కమిటీలో తొమ్మిది రకాల అనుబంధ కమిటీలు, ఒక గ్రామ కమిటీ ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి రాజేశ్వరి రెడ్డి, జడ్పిటిసి శ్రీకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, మండల వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రైతు విభాగ కార్యదర్శి సుబ్బరామిరెడ్డి, రాజంపేట నియోజకవర్గం రైతు విభాగ అధ్యక్షులు కే వి సుబ్బయ్య, మండల యూత్ కన్వీనర్ కృష్ణ చైతన్య, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి,పిడుగు సుబ్బారెడ్డి, కాడే శివయ్య,రామ్మూర్తి, షేక్ సర్దార్, మల్లికార్జున్రెడ్డి, డాక్టర్ మురళి మోహన్ రెడ్డి,ఏకుల వెంకటరామిరెడ్డి, జగదీష్, నేకనాపురం వెంకటసుబ్బారెడ్డి ,పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.