గద్వాల జిల్లా రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 2026 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా, గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. కాలనీవాసుల ఇబ్బందులను గుర్తించిన ఆయన డ్రైనేజీ పనులను అధికారికంగా ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.