క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయి…

★గుర్రం శ్రీనివాస్

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఆర్కెపి ఛాంపియన్షిప్, జిఆర్ఎం టౌన్ షిప్ గుర్రం శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం శ్రీనివాస్ మాట్లాడారు. జిఆర్ఎమ్ టౌన్షిప్ ఆధ్వర్యంలో సామాజిక సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు . క్రికెట్ పోటీలో రెండు రోజులపాటు నిర్వహించడం జరిగిందని పోటీలకు సహకరించిన ఉప్పులపు సురేష్, అజయ్ కుమార్, శ్రీనివాస్, శ్రీకాంత్ గౌస్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయని అన్నారు. విన్నర్ టీం నూనె శేఖర్, రన్నర్ టీమ్ ఆర్కేపి 11 టీమ్ లకు ప్రైజ్ మనీ అందించడం జరిగింది తెలిపారు.