కోసువారిపల్లి టిటిడి ఆలయ అభివృద్ధికి సహకరించండి.

★టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డికి వినతి.

సాక్షి డిజిటల్ న్యూస్ : 28 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించాలని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డిని కూటమి నాయకులు కోరారు. మంగళవారం టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి ని కోసువారిపల్లి స్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులు, కూటమి నాయకులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి ప్రధాన అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వాములు వెంకటేశ్వర స్వామికి భాను ప్రకాష్ రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి ల పేరుతో ప్రత్యేక పూజలు, అర్చనలు అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు 2010 లో టీటీడీ పరమైన ఈ పురాతన ఆలయానికి నూతన కళ్యాణమండపం, పుష్కరిణి, ఆలయంలో ఇద్దరు వేద పండితులు, స్వీపర్లు, వసతి గృహాలు, నూతన తేరు, ఏర్పాటు చేసి తంబళ్లపల్లె మండలంలో ఆలయాల సముదాయం ఉన్నందున పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని కోరారు. టిటిడి ఆలయానికి సంబంధించిన సమస్యలను టిటిడి బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ బ్రహ్మోత్సవాల నిర్వహణలో అధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు చేసిన కృషిని కొనియాడారు. వారి వెంట బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.