కొరట్లగూడెంలో రేపటి నుంచి సమ్మక్క సారక్క జాతర

నేలకొండపల్లి: (సాక్షి రిపోర్టర్ పసుపులేటి లింగస్వామి ) జనవరి 28, నెలకొండపల్లి మండలంలో శ్రీ సమ్మక్క సారక్క జాతర బుధవారం నుంచి ప్రారంభం కానంది ఈనెల ఈనెల 28 29 30 తేదీల్లో,3 రోజులు పాటు ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి వినోద్ తెలిపారు. బుధవారం బోనాలు సమర్పణ, గురువారం సమ్మక్క తల్లికి ఒడిబియ్యం పోసి, కుంకుమ భరణిరూపంలో గద్దెపై ప్రతిష్టిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరారు.