సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; వేలేరు స్కూల్ కుకునూరు మండలం ఏలూరు డిస్టిక్ కు చెందిన ఆదివాసి టీచర్ కుంజా రమాదేవి కి బెస్ట్ టీచర్ అవార్డు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్లి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. ఈ బెస్ట్ టీచర్స్ అవార్డు ప్రోగ్రాం ఉద్దేశించి (ఏపీసి) అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో కేజీబీవీ వేలేరు స్కూల్ కుకునూరు మండలం కు చెందిన కుంజా రమాదేవికి బెస్ట్ టీచర్స్ అవార్డు రావడం హర్షం వ్యక్తం చేశారు కుంజా రమదేవి విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ వహించి విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించటం వలన ఈ బెస్ట్ టీచర్ అవార్డు పొందారని ఆయన పేర్కొన్నారు ఒక ఆదివాసి తెగల్లో పుట్టిన ఆమె అంచలంచలుగా ఎదిగి కృషి పట్టుదలతో పనిచేయటం కొనియాడ దగ్గ విషయమని ఆయన అన్నారు. విద్యార్థుల చదువుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల జీవితాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ప్రయత్నం ఎనలేనిదని ఆయన కొనియాడారు. క్రమశిక్షణ డ్యూటీలపట్ల సమయపాలన పాటిస్తూ తనదైన శైలిలో విద్యా బోధనలు చేయటం ఆమెకు ఆమె చాటి అని చెప్పటం అతిశయోక్తి కాదని ఆయన అన్నారు సమయాన్ని వృధా చేయకుండా ఎక్కువ విద్యార్థుల తోటే గడుపుతూ వారి యొక్క ప్రేమను చురకొన్న ఉపాధ్యాయునిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఆమెకు ఉన్నాయని అందుకే బెస్ట్ అవార్డు టీచర్స్ కి ఎన్నికయ్యారని ఆయన అన్నారు. ఎంతో నేర్పుతో ఓర్పుతో విద్యార్థులకు చెరువుగా ఉంటూ విద్యార్థుల్లో ఒకరిగా కలిసిపోయే ఉపాధ్యాయురాలు కుంజా రమాదేవి అని ఆయన గుర్తు చేశారు. విద్యతోపాటు సమాజం యొక్క విలువలను మహనీయుల చరిత్రను ఆమె విద్యార్థులకు బోధిస్తూ విద్యార్థుల జ్ఞానాన్ని మరింతగా పెంపొందే దాంట్లో ఎంతో కృషి చేశారని ఆమె ఇంకా ఎన్నో ఇటువంటి అవార్డులను పొంది ఆదివాసుల ఉపాధ్యాయులకు ఆదర్శం కావాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ప్రోగ్రాం లో (డిఇఓ) డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకట నరసమ్మ, జి సి డి ఓ నవీన, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.