కలెక్టర్, ఎస్పి, చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న కౌతాళం కానిస్టేబుల్ మదిలేటి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 కర్నూలు జిల్లా కౌతాళం మండలం, కౌతాళం కానిస్టేబుల్ మదిలేటి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పటేల్,జిల్లా కలెక్టర్ సిరి ఆధ్వర్యంలో కౌతాళం కానిస్టేబుల్ మదిలేటి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మదిలేటి మాట్లాడుతూదీనిని నేను అత్యంత గౌరవంగా మరియు గర్వకారణంగా భావిస్తున్నాని అన్నారు. అధికారులు, సహచరులు అందించిన మార్గనిర్దేశం,ప్రోత్సాహం, సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని కానిస్టేబుల్ అన్నారు. ఈ గుర్తింపు ప్రజాసేవలో రాజ్యాంగ విలువలకు కట్టుబడి, నిజాయితీతో, అంకితభావంతో మరియు ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందించేందుకు నాకు మరింత ప్రేరణనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.