సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు జనవరి 28 2026, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని కునికునిపాడు, మున్నలూరు, మోగులూరు,పేరకలపాడు, ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులు కంచికచర్ల డిప్యూటీ తాసిల్దార్ కి అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ మాట్లాడుతూ
కంచికచర్ల మండల గ్రామాల్లో భూములు స్వచ్ఛమైన వ్యవసాయ భూములు. ప్రభుత్వం దృష్టిలో విలువైన భూములు కావు అని ఇది స్పష్టంగా చూపిస్తుంది. భూమి వెలుపల,బయట మరియు చుట్టుపక్కల ఉన్న భూములు ఇప్పటికే భూ మార్పిడికి గురయ్యాయి మరియు నివాస లేఅవుట్లు మరియు వాణిజ్యంతో సహా వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించ బడుతున్నాయి. ఈ భూమి కంచికచర్ల కు చాలా దగ్గర గా ఉందని మరియు హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారి రోడ్డు కు తెలంగాణ రాష్ట్ర మదిరి పట్టణం కంచికచర్ల కు అనుసంధానం గా ఉంది.జాతీయ రహదారి యాక్సెస్ రోడ్డు కు సమీపాన ఉన్నది. భవిష్యత్తులో పట్టణ విస్తరణ కు అవకాశం ఉంది రాజధాని అమరావతి కి దగ్గరగా ఉంటుంది. రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు, రవాణా రంగం అభివృద్ధికి, వివిధ రకాల ప్రజలకు జీవనోపాధి మరియు ఆర్థిక భద్రత కోసం ఈ భూమిపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. న్యాయమైన, వాస్తవికమైన మరియు మార్కెట్ ఆధారిత పరిహారం లేకుండా ఎటువంటి సమాచారం రైతులకు లేదని,సామాజిక ప్రభావ అంచనా, పర్యావరణ పరిరక్షణ పరిస్థితి అవసరం ఉంది. ఓఆర్ఆర్ వెడల్పును 140 మీటర్ల నుండి 250 మీటర్లకు పెంచడాన్ని పునఃపరిశీలించాలి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లెల.సుబ్బారావు, వెంకటేశ్వరరావు, నన్నపనేని సురేషు తదితరులు పాల్గొన్నారు.