సాక్షి డిజిటల్ న్యూస్: 28 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం నూతన డీఎస్పీ. ఆదినారాయణ. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ. ఆది నారాయణకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ముందుండాలని, పారదర్శకమైన సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ. ఆదినారాయణ ఎమ్మెల్యేకు పూలమొక్కను అందజేశారు.