సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 27 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై జల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న అచ్చంపేట గురుకుల పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు చలమందను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలస్వామి మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయడుగా ఎన్నికైన చలమంద ఇదే పాఠశాలలో విద్యార్థిగా విద్యను అభ్యసించి ఇదే పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయడుగా కూడా ఎన్నికవడం చాలా గర్వకారణం అన్నారు పాఠశాలలోని ప్రతి ఉపాద్యాయుడు విద్యార్థులకు సరైన భోదన అందించి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు అదేవిధంగా విద్యార్థులు చలమందను ఆదర్శంగా తీసుకుని చదవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలస్వామి ఉపాద్యాయులు శశిధర్, కృపాకర్,జి శ్రీనివాస్, మనోహర్,చింతల మల్లేష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.