సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; సమాచార పౌర సంబంధాల శాఖ జారీచేసిన తాజా ప్రకటన జర్నలిస్టుల స్వేచ్ఛను హరించటమేనని మహా జన సమితి ఆదివాసి రాష్ట్ర కన్వీనర్ కంగాల రమణకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు మాత్రమే వాహనాలపై ప్రెస్ అని రాసుకునేందుకు అనుమతి ఉంటుందని ప్రకటించడం పట్ల ఆమె తప్పు పట్టారు. అక్రిడేషన్ లేని వారు అలా రాసుకుంటే మోటారు వాహన చట్టానికి విరుద్ధమని సమాచార పౌరు సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అక్రిడేషన్ లేని జర్నలిస్టులు,జర్నలిస్టులు కాదా అని ఆమె ప్రశ్నించారు. అక్రిడేషన్ కార్డు లేని జర్నలిస్టులు వాహనాలపై ప్రెస్ అని రాసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొనడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తున్న జర్నలిస్టుల పత్రికా హక్కును కాల రాస్తున్నారని ఆమె దుయ్యబట్టారు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవించాలని వారికి తగిన ప్రోత్సాహం అందించాలని అవమానపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించవద్దని తక్షణమే ఉత్తర్వులను ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.