అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి

★ట్రాక్టర్ స్వాధీనం, డ్రైవర్ అరెస్ట్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 మంచిర్యాల జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్, మందమర్రి పట్టణ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు కోరాడ జులిపించారు. ఈరోజు ఉదయం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. మందమర్రి మందమరి ఎస్సై నరేష్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ కె. మిలింద్ కుమార్ తన బృందంతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పాలవాగు (సండ్రన్‌పల్లి) నుండి పట్టణం వైపు వస్తున్న ట్రాక్టర్‌ను అనుమానంతో ఆపారు. వాహనాన్ని తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి ఒప్పుకోలు. పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్ గట్టు మారుతి (సండ్రన్‌పల్లి నివాసి) ని విచారించగా.. యజమాని కుమారుడు మ. రాజు ప్రోద్బలంతో, తక్కువ సమయంలో ఎక్కువ లాభం గడించడం కోసం దొంగ తనంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు.