సాక్షి డిజిటల్ న్యూస్ కంటోన్మెంట్ బోవెన్‌పల్లి రిపోర్టర్ నటరాజ్ గాడ్ 26 జనవరి, కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయకుండా తాత్సారం చేస్తూ , నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలందరికీ సంక్రమించిన హక్కులు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు దక్కకుండా చేస్తున్న కేంద్రం లోని బిజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గత 6 రోజులుగా కార్ఖానా లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద చేస్తున్న రిలే నిరహార దీక్షను ఈరోజు 7 వ రోజున దీక్షా శిబిరం వద్దే 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి కంటోన్మెంట్ ప్రజలు కేంద్ర ప్రభుత్వ కబంద హస్తాల నుంచి విముక్తి పొంది రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం జరిగి, అభివృద్ధి ఫలాలను పొందాలని ఆకాంక్షించి దీక్షను ప్రారంభించారు.
