77గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మరిపెడ మండల భూక్యతండ గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ మాంగిని శంకర్

సాక్షి డిజిటల్ న్యూస్ మరిపెడ రిపోర్టర్ హేమ, సర్పంచ్ బోడమాంగిని శంకర్ అధ్వర్యంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరఆ జాతీయ జెండాకు వందనం చేశారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, ప్రజలే పరిపాలించుకునే సమాఖ్య స్ఫూర్తితో దృఢ విశిష్టమైన రాజ్యాంగం మనదని అన్నారు.ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణమని అన్నారు. అనంతరం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి యామిని ఉప సర్పంచ్ టీక్య వార్డ్ నెంబర్లు మాజీ సర్పంచ్ భూక్య సేవ్య భూక్య కిషన్ బోడాబాషా బోడ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.