సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 27 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంత సాగరం గ్రామానికి చెందిన బోపట్లపల్లి యుగంధర్ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యుగంధర్ పరిస్థితిని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మెట్టుకూరు మనోజ్ రెడ్డి ఆయనను కలిసి పరామర్శించారు. అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుండి రూ.41,000/- ఆర్థిక సహాయం మంజూరై, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా చెక్కును యుగంధర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అవసర సమయంలో పేదలు, బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. చెక్కు అందుకున్న యుగంధర్ కుటుంబ సభ్యులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి, మెట్టుకూరు మనోజ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.