( సాక్షి డిజిటల్ న్యూస్) ఎర్రగుంటపల్లి జనవరి :26 77వ గణతంత్ర దినోత్సవాన్ని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అడపా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది అని,ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. శ్రీ చైతన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దేశభక్తి, కర్తవ్యబోధ పెంపొందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ పొట్టి చక్రదరరావు మాట్లాడుతూ విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు.ఆట పోటీలో గెలుపొందిన విద్యార్థులకు లైన్స్ క్లబ్ సభ్యులు చేత బహుమతులు ప్రదానం చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
