సాక్షి డిజిటల్ న్యూస్, 26/జనవరి/2026, షాద్‌నగర్:రిపోర్టర్/కృష్ణ, భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలంలోని శేరిగూడ గ్రామంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దేశభక్తి చాటుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. గర్వంగా రెపరెపలాడిన జాతీయ జెండా గ్రామ సర్పంచ్ శారద శంకరయ్య గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ విలువలే మనకు మార్గదర్శకం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే, బాధ్యతలను విస్మరించకూడదని సూచించారు. ప్రతి పౌరుడు క్రమశిక్షణతో ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై.. వందేమాతరం నినదాలు చేసారు…