శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

★జాతీయ గౌరవంతో నిండిన శాంతినికేతన్ ఉత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 27 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) మండల కేంద్రమైన అనంతసాగరం లోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐ గంగాధర్, ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి గ్రామంలో ర్యాలీ నిర్వహించి దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోలి ప్రభాకర్, డైరెక్టర్ పాపి శెట్టి నరసింహులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.