సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి: 27 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు ) కడప జిల్లా వేంపల్లి మండలం వేంపల్లి గ్రామంలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, దేశభక్తితో జరిపారు. కళాశాల లో జాతీయ పతకాన్ని ప్రిన్సిపాల్ ఎస్. నాగేంద్ర ఎగురవేసి, తన ప్రసంగంలో జాతీయ సమైక్యత మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. క్రీడలు మరియు విద్యా రంగాలలో విద్యార్థులు సాధించిన విజయాలను ప్రశంసించారు, సమగ్ర విద్య పట్ల కళాశాల నిబద్ధతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్ర , ప్రసాద్ ,విద్యార్థులు మరియు సిబ్బంది మహేష్, రమేష్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గీతంతో వేడుకలు ముగిశాయి, జాతీయ గౌరవం మరియు విలువల పట్ల కళాశాల అంకితభావాన్ని పునరుద్ఘాటించారు .