సాక్షి డిజిటల్ ప్రతినిధి, దుమ్మ రాజు రిపోర్టర్ 26-1-2026. ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం రహేమాన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన ఆటపాటలు, సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కుల కు గాను 590 మార్కులు సాధించి ప్రతిభ చూపిన విద్యార్థిని రుబీన సర్వర్‌ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ఆమెకు రూ.10,000 నగదు బహుమతిని అందజేసి శాలువతో సన్మానించారు.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని, ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అంద జేశారు. విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్‌లు, కళాత్మక నృత్యాలు చూసి ప్రేక్షకులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.