వంకాయ గూడెం గ్రామ సమస్యలపై , ఎమ్మెల్యే ఆరా !!!

సాక్షి , డిజిటల్ న్యూస్, జనవరి 26, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్ట్,, రాజు శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామ సమస్యలపై మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆరా తీశారు,, కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారి పక్కన వంకాయ గూడెం కూడా అభివృద్ధిలో వెనుకంజ వేయడం పట్ల ఆయన గ్రామ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు,, మండలంలోని అన్ని గ్రామాల కన్నా వంకాయ గూడెం చిన్న గ్రామంగా,పేరు ఉంది,, మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి గ్రామంలో ఇంతవరకు కనీసం వసతులు కూడా లేకపోవడం, యువకులకు క్రీడా మైదానం, లైబ్రరీ,, తదితర అంశాలపై ఎమ్మెల్యే ఆరా తీయడం జరిగింది,, మినరల్ వాటర్ ప్లాంట్ కేవలం ఒక ప్రాంతానికి ఉండి బిసి కాలనీ వైపు లేకపోవడం ఇబ్బందిగా ఉన్న పరిస్థితిని కూడా ఎమ్మెల్యే ఆరా తీసి వివరాలు సేకరించారు.