సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 భూమయ్య పిట్లం పిట్లం మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ రాజకీయ కార్యాలయంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో తిరుగుతూ పథక ఆవిష్కరణ నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్, పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకట్రావు, తాసిల్ కార్యాలయంలో మహేంద్ర కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో రఘు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు లోక శ్రీనివాస్, జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ 77వ గణతంత్ర వేడుకలను జరుపుకోవడం శుభదాయకం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన గ్రంధాన్ని వేడుకలను మనమందరం కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు భూమయ్య, సీనియర్ పాత్రికేయులు వడ్ల రవి, మహబూబ్,హన్ను సాబ్, మునీర్, సాయిలు,నవీన్,సాయిబాబా, మోసిన్, పాల్గొన్నారు.