సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్, విశాఖపట్నం : జనవరి 26, ‘యుఫోరియా’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రమిది . ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం లోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు చిత్ర యూనిట్… ఈ సందర్బంగా దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా అందరినీ ఆలోచింపచేస్తుందన్నారు.
“యుఫోరియా’కు ప్రతి కుటుంబంలో ఒకరు కనెక్ట్ అవుతారు అని కొత్త వాళ్లతో ఈ సినిమా చేయడానికి 6 నెలలు ఆడిషన్స్ చేశాం అని అన్నారు.20 మంది కొత్తవారిని తీసుకోగా టీనేజ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వయసు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటించినవారు అందరూ టీనేజ్ వాళ్లే. కథ వింటున్నప్పుడే సారా అర్జున్ అయితే బాగుంటుందని నిర్మాత నీలిమ చెప్పింది. సారా అర్జున్ నటిస్తేనే ఈ సినిమా తీద్దాం లేదంటే ఆపేద్దాం అని ఆమెతో చెప్పా. రేపు సినిమా చూశాక కూడా అందరూ ఇదే అంటారు. అంత గొప్పగా నటించింది. ఈ అమ్మాయి వయసు 17 ఏళ్లు అయినా.. చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి కథ కచ్చితంగా ప్రేక్షకుల చెప్పాలి అని వెంటనే ఓకే చేసేసింది”అన్నారు.. ట్రయిల్ లో సివిల్ సర్వెంట్ అవ్వాలని కలలు కనే అమ్మాయిగా సారా అర్జున్ కనిపించింది. ఆ అమ్మాయి ఒక పార్టీకి వెళుతుంది. ఆ తర్వాత ఆమె జీవితం తల్లకిందులు అవుతుంది. పోలీసులు పోక్సో కేసు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? తనయుడికి జన్మ ఇచ్చినందుకు భూమిక ఎందుకు బాధ పడ్డారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలన్నారు. నటి భూమిక మాట్లాడుతూ..“ఇందులో ఎంతో కీలకమైన పాత్ర వింధ్య.. ఈ పాత్ర కోసం భూమికని తీసుకుందాం అని నీలిమ దర్శకుడు కి చెప్పగానే నన్ను కలిశారు..గతం లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి అందరి మన్నలను పొందాను ఇది కూడా అందరికి నచ్చే పాత్ర.. ప్రస్తుత సమాజం లో ప్రతి అమ్మాయి, ప్రతి గృహిణి ప్రతి ఫాదర్ ప్రతి అన్న, తమ్ముడు, అందరు చూడాల్సిన కధ తో వస్తున్నా చిత్రాన్ని ఆదరించాలని కోరారు…గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు ఇతర ప్రధాన తారాగణం ఉన్నారని పేర్కొన్నారు.
