(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్పల్లి మండల్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ) 26/01/2026, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జువ్వడి నర్సింగరావు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుక ఉత్సాహంగా జరుపుకున్నారు దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుంకే ప్రసాద్ మరియు పార్టీ శ్రేణులు,, పాల్గొనడం జరిగింది.