ములకలచెరువు జూనియర్ కాలేజీలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ :27 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండలం జూనియర్ కాలేజ్ నందు 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు ఎం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేసి పిల్లలచే జాతీయ గీతం ఆలపించి స్వతంత్ర సమరయోధులను ఒక్కసారి స్మరించుకున్నారు. ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ మహాత్మా గాంధీ లాంటి సహనం ఓర్పు గుణం రావాలని, ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడు కావాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అల్తాఫ్ భాను, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్ శివరామయ్య, జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయ బృందము మరియు పిల్లలు పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.