సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 26,2026,( రిపోర్టర్ ఇమామ్ ), తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మురుగుజ్జులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని మరుగుజ్జు బాధితుడు రాజశేఖర్ తెలిపారు. సోమవారం నాడు మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పథకాలను మురుగుజ్జులకు వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.