సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ సభావట్ సునీత గురు నాయక్ ఆధ్వర్యంలో 77వ గనతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గ్రామ అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటున్న సునీత గురునాయక్ గ్రామస్తులకు గనతంత్ర వేడుకల గొప్పతనాన్ని వివరించారు గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరికీ తన సేవలను అందించి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.