సాక్షి డిజిటల్ న్యూస్ :26 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) 77వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పతాకావిష్కరణ చేసి, జాతీయ జెండాకు వందనం గావించిన తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందుగా కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు ఎనలేని త్యాగాలు చేశారు. వారందరి ఆశయా లను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణతో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాల న్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన మన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు నిబద్ధత ఉండాలని ఈ సందర్భంగా జెసి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డిఆర్ఓ మధుసూదన్ రావు, కలెక్టరేట్ ఏవో నాగభూషణం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.