బోడుప్పల్ సర్కిల్ అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు మార ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

★రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద కాలనీలో అన్నపూర్ణ ఏసీ కమ్యూనిటీ హాల్…. ★అభివృద్ధిలో నంబర్ 01 అన్నపూర్ణ కాలనీ..కాలనీ వాసుల సహకారంతో మరింత అభివృద్ధి మార ప్రభాకర్…..

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 27/2026, మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్, గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్ అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు మార ప్రభాకర్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం బోడుప్పల్ సర్కిల్ సీనియర్ నాయకులు కాలనీవాసులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ జరిగాయి అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు మార ప్రభాకర్ మాట్లాడుతూ కాలనీలో ప్రతి పండగ కుటుంబ సభ్యుల జరుపుకుంటామని అలాగే బోడుప్పల్ సర్కిల్ లోని నంబర్ వన్ కాలనీ అన్నపూర్ణ కాలనీ అని రాష్ట్ర ప్రభుత్వం మరియు కాలనీవాసుల సహకారంతో అన్నపూర్ణ ఏసీ కమ్యూనిటీ హాల్ నిర్మానిస్తున్నామని ప్రతి ఒక్క సహాయ సహకారాలు ఉండాలని మార ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బోడుప్పల్ సర్కిల్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.