సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 మంచిర్యాల జిల్లా రిపోర్టర్ రావుల రాంమోహన్…. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి 79 ప్రత్యేక బస్సులు ఏర్పాటు భక్తులకు మెరుగైన, సురక్షిత ఆర్టీసీ సేవలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తుల ప్రయాణ, రవాణా సౌకర్యాలను మెరుగుపరచే ఉద్దేశంతో 79 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, ఆదివారం రోజున జాతర బస్సు సేవలను బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆర్టీసీ అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ వద్ద తగిన సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని, మహిళా భక్తులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు నిరంతరంగా బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్ , ఏసిపి రవికుమార్,ఆర్టీసీ ఎండీ రాజశేఖర్,ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
