పవర్ లిఫ్ట్ పోటీల్లో జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి నందిగామ కు వన్నె తెచ్చిన మేకల వెంకట సాయి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 27 2026 ఎన్టీఆర్ జిల్లా నందిగామ పవర్ లిఫ్ట్ పోటీల్లో జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి నందిగామ కు వన్నె తెచ్చిన మేకల వెంకట సాయి కు పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామంలో పాఠశాల లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంఇఓ జి శ్యామ్ నేడు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎంఇఓ మాట్లాడుతూ నందిగామ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మేకల వెంకట సాయి అభినందనీయుడు అని భవిష్యత్తులో ఎంతో మంది యువకుల కు స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ కో ఆర్డినేటర్ కొంగర దుర్గా ప్రసాద్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైవీ నరసింహ రావు , చైతన్య కళాశాల అధ్యాపకులు కోటేశ్వర రావు , పలువురు ప్రముఖులు, విజేత తండ్రి మేకల శ్రీను, పలువురు విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.