పట్టణ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి: 27 వేములవాడ ఆర్. సి.ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్.. వేములవాడ పట్టణం లోని ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు తిప్పాపురం లో ఆల్ఫా మసీద్ వద్ద పట్టణ ముస్లిం కమిటీ ప్రధాన కార్యదర్శి షాహిద్ పాషా జండా ఆవిష్కరణ చేశారు. షాహిద్ పాషా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం కేవలం ఒక జాతీయ వేడుక కాదు - ఇది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దిన రోజుకు నివాళి. మనల్ని నిర్వచించే ఆదర్శాలను గౌరవించడానికి మరియు మనం కలిసి సాధిస్తున్న పురోగతిని జరుపుకోవడానికి ఇది ఒక క్షణం.పౌరులు - ముఖ్యంగా విద్యార్థులు, యువత మరియు సృజనాత్మక మనస్సులు - వారి దేశభక్తిని వ్యక్తపరచాలని, వారి ప్రతిభను ప్రదర్శించాలని మరియు బలమైన, ఐక్యమైన మరియు ప్రగతిశీల భారతదేశం కోసం వారి దార్శనికతను పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ ముస్లిం ఉపాధ్యక్షులు. మహమ్మద్ అజీమ్. ఆర్గనైజర్ ఫహద్ పాషా. జాయింట్ సెక్రెటరీ అబ్దుల్ రెహమాన్. కమిటీ సభ్యులు. ఇమ్రాన్. షహబాజ్ లతోపాటు, మజీద్ కమిటీల అధ్యక్షులు , నవాబ్. షేక్ ఇమామ్, సర్వర్ పాషా, రజాక్ గౌస్, అబ్దుల్ కరీం.మరియు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ రజాక్, షేక్ సాబీర్, సయ్యద్ సాబీర్, ఆతవుల్ రహమాన్, యువ నాయకులు సోహెల్ ఖాన్, మరియు మహమ్మద్ రహుఫ్ ఖాన్. అబ్దుల్ రఫీక్. ఫస్సి. యూసఫ్ షరీఫ్. సయ్యద్ షబ్బీర్. బాబా. అంజత్ పాషా. హైమద్ షరీఫ్. మజర్. రిజ్వాన్. తదితరులు పాల్గొన్నారు.