పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 27 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గాంధీ చౌక్ అంగడి బజార్ వద్ద పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండూరి సురేష్ ఆధ్వర్యంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు జాతీయ పతాకం ఆవిష్కరించారు.సంఘ సభ్యులు,పాఠశాల విద్యార్థులు,ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.