నెలసరి జీతాలు రాక ఇబ్బంది పడుకున్న 102 డ్రైవర్లు

★రెండు నెలలుగా జీతాలు లేక నరకాయతన చూస్తున్న 102 డ్రైవర్లు

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 27 రిపోర్టర్ షేక్ సమీర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కాపాడే అత్యవసర సేవలో కీలకమైన 102 అంబులెన్స్ డ్రైవర్లు నేడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు జీవనం సాగిస్తున్నారు రెండు నెలలు జీతాలు అందగా పోవడంతో కుటుంబ పోషణ కుటుంబం కోసం అప్పులపై ఆధార పడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. రోజుకి 12 గంటలు పైగా విధులు నిర్వహిస్తున్న, గర్భిణీ స్త్రీలు, అత్యవసర రోగులను సురక్షితంగా ఆసుపత్రిలోకి తరలిస్తున్న తమ సమస్యలపై మాత్రం ఎవరు స్పందించడం లేదు. డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రాణాల మధ్య పని చేస్తున్న తమ భద్రత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. పేరుకే ప్రభుత్వం అంబులెన్స్ లైన వాస్తవంగా నిర్వహణ ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉండడంతో డ్రైవర్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది ధర్నాలు చేసే అవకాశం లేదు అధికారులకు సమస్యలు వినిపించే దారాలు కూడా మూసుకుపోయాయని వారు అంటున్నారు నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాగుతున్న తమ జీవితాలు మాత్రం ఏళ్లుగా మారలేదని కొన్నిసార్లు అర్థ ఆకలితో కుటుంబాలు జీవించాల్సి వస్తుంది డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు గత ఎనిమిది ఏళ్లుగా ఐదు పరిస్థితి కొనసాగుతున్న వైఫల్యానికి నిదర్శనం అని వారు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికి ప్రభుత్వం స్పందించి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి కనీస వేతనం 18000 వేలు ఉద్యోగ భద్రత కల్పించాలని 102.అంబులెన్స్ డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.