సాక్షి డిజిటల్ న్యూస్, తేది- 26-01-2026, గ్రామం-మస్కాపూర్, మండలం- ఖానాపూర్, జిల్లా-నిర్మల్.రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కోమరంభీం చౌరస్తా వద్ద నిర్మించిన డబుల్ బేడ్ రూంలు అనర్హులకు కేటాయించారని గత రెండు సంవత్సరాలుగా పోరాటం, దర్నాలు చేసిన ఎలాంటి ఫలితం లభించడం లేదని ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి లింగన్న ఖానాపూర్ మండల కార్యదర్శి సురేష్ లు పేర్కోనారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏర్పాటు చేసిన డబల్ బెడ్ రూముల అవినీతి అక్రమాలపై మరియు డబుల్ బెడ్ రూములను గత ప్రభుత్వ హాయంలో అనర్హులకు కేటాయించి ఇతర రాష్ట్రాల వారైన మహారాష్ట్ర, యుపి ,బీహార్, కర్ణాటక, ఆంధ్ర మరియు తెలంగాణలో ఇతర జిల్లాల వారికి కొంతమంది రాజకీయ అండ దండలతో అమ్మడము కొనడం జరిగిందని అల్లేపు పీటర్ వ్యాఖ్యానించారు.ఖానాపూర్ పట్టణంలో లో గత 50 సంవత్సరాల నుండి నివసిస్తున్న సెంటు భూమిలేని నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ,వీరు గత రెండు సంవత్సరాల క్రితం నుండి ఉద్యమాలు చేస్తూ కలెక్టర్ ఎమ్మార్వో కమిషనర్ ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇస్తూ ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు వివిధ రూపాలలో ఉద్యమాలు చేయడం జరిగిందని,కానీ ఇప్పటివరకు 31 మంది లిస్టును మాత్రమే అధికారులు గుర్తించారు. అలాగే మిగతా అనర్హులైన వారిని గుర్తించి వారిని కూడా తొందరగా ఖాళీ చేయించి అర్హులైన నిరుపేద ఖానాపూర్ పట్టణ వాసులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు మధ్య పెడతారో అర్థం కావట్లేదని, ఈ విషయంలో ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అధికారులు సీరియస్ గా లోతైన సర్వే చేసి ఇతర రాష్ట్రాల వారిని మరియు రాజకీయ నాయకుల బినామీ పేర్లతో అక్కడ నివసిస్తున్న పక్క గ్రామాల వారిని నివాసాలకు ఉంచి అక్కడున్న స్థలాన్ని డబుల్ బెడ్ రూమ్లను అక్రమించు కుందామని ఆలోచనలు కొనసాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.మరి కొంతమందిడబుల్ బేడ్ రూం లను వెరె వారికి కిరాయిలు ఇస్తూ ఖానాపూర్ లో నివాసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తక్షణమే అనర్హులను తొలగించి అర్హులైన పేదలకు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ల చోరువ తీసుకొని పేదలకు డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డబుల్ బెడ్ రూముల మండల కార్యదర్శి తోట రాజామణి, కమల, కలపన, రోజా, షమీం, సుష్మన హేమల్ రూము రామ్, కవిత, లక్ష్మి, లావణ్య మీరాసుచి బేగం, రూప బేగం, నసీం బేగం, మజ్జిగ బండారి, మజీద్ ఖాన్ సదుల్లా గంగోత్రి తదితరులు పాల్గొన్నారు.