సాక్షి డిజిటల్ జనవరి 26 వనపర్తి జిల్లా పెబ్బేరు: మండల పరిధిలోని కంచిరావుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం నాగరాజు గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో గంధం, భస్మం, అరటి ఆకులతో జాతీయ జెండా అలంకరణతో అద్భుతంగా శివ స్వాముల సౌజన్యంతో ఉదయాన్నే అభిషేకాలతో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా కార్యక్రమాలు అనంతరం త్రివర్ణ పతాకం జెండా రంగులను అలంకరించారు. శివ దీక్షలు లో భాగంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం పురస్కరించు కొని కంచిరావుపల్లి గ్రామానికి చెందిన శివ స్వాములందరి సౌజన్యంతో జాతీయ త్రివర్ణ పతాకం అలంకరణ చేసినట్లు నాగరాజు గౌడ్ గురుస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల గౌడ్ స్వామి, భరత్ గౌడ్ స్వామి, శేఖర్ స్వామి, శివ స్వాములు ,గురు స్వాములు పాల్గొన్నారు.
