తెలుగు టీచర్ ని వెంటనే నియమించాలి

★లేని పక్షంలో అతి త్వరలో డీఈఓ, ఎంఈఓ ఆఫీస్ ను ముట్టడిస్తాం ★బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ★

సాక్షి డిజిటల్ న్యూస్ : 26 జనవరి 2026 మునుగోడు రిపోర్టర్ (సునీల్ సులేమాన్) : మునుగోడు మండలం పలివెల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ ని వెంటనే నియమించాలని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ మాట్లాడుతూ గత నవంబర్ 2025 నుండి ఇప్పటివరకు తెలుగు టీచర్ లేకపోవడం చాలా బాధాకరమని వారన్నారు మూడు నెలల నుండి విద్యార్థులకు తెలుగు టీచర్ లేకపోవడం వలన ఎంతో ఇబ్బందులకు మనోవేదనకు గురవుతున్నారు అదే విధంగా బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నందున ఇంతవరకు టీచర్ని నియమించకపోవడం డిఈనిర్లక్ష్యం వలన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడేది పోయి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్న డిఈఓ ని వెంటనే నియమించక పోతే త్వరలో ఈ ఆఫీస్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు మార్చి నెలలో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నందున చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కావున వెంటనే తెలుగు టీచర్ ని నియమించాలని కోరుతున్నాం లేనియెడల త్వరలో ఎంఈఓ ఆఫీసు డిఈఓ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.