తమ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సలాది కుటుంబ సభ్యులు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం, సన్నవిల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త
సూరపురెడ్డి సురేష్ విజ్ఞప్తి మేరకు వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన మహోన్నత వ్యక్తి సలాదిస్వామి నాయుడు తన తల్లిదండ్రులు కీర్తిశేషులు సలాది బుచ్చిరాజు వెంకటలక్ష్మి యొక్క జ్ఞాపకార్థం సర్పంచ్ చిక్కం పెదబాబు, వీరవెల్లిపాలెం సర్పంచ్ సలాది బుచ్చిరాజు ఆధ్వర్యంలో వికలాంగులకు మరియు పేద వితంతువులకు ఈరోజు దుప్పట్ల పంపిణీ జరిగింది. సర్పంచ్ పెదబాబు మాట్లాడుతూ స్వామి నాయుడు మరియు బుచ్చి రాజు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి ఎంపీటీసీ వంగా గిరిజ తమ సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గని శెట్టి భోగిరాజు, సలాది కళా వెంకట బుచ్చిరాజు ,గనిశెట్టి లలితా శ్రీనివాస్, చిక్కం నాని, నిమ్మకాయల మను, గనిశెట్టి శివ ,గనిశెట్టి బాలు, గనిశెట్టి వీరు ,వంగా సతీష్ తెలుగుదేశం నాయకులు గనిశెట్టి రంగా రమేష్, గనిశెట్టి అర్జున కృష్ణారావు, జానా శంకర్ మరియు వైసీపీ నాయకులు చిక్కం నాగబాబు పాల్గొన్నారు.దీనికి గాను పేదలందరూ దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చివరగా దాతలకు చిరు సన్మానం చేశారు.