టి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి:27. వేములవాడ ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేములవాడ ఆధ్వర్యంలో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తొగరి కరుణాకర్ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం అవతరణ సందర్బంగా యావత్ భారత ప్రజలు గణతంత్ర వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు బొప్ప బిక్షపతి, గొల్లపల్లి వేణు, అవదూత శ్రీధర్, బిక్షపతి, వెంకటస్వామి, సంజీవ్,సయ్యద్ షబ్బీర్, అబ్దుల్ రఫీక్, కొప్పుల ప్రసాద్. చిర్రం ప్రసాద్, చింతల శ్రీనివాస్, కొమురవెల్లి మునిష్ తదితరులు పాల్గొన్నారు.