జీ. వో 1076 ప్రకారం ముల్కనూరులో మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి..

*98 జీవోలు రద్దు చేయాలి.. *మున్నేరు జల సాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్…

సాక్షి డిజిటల్ న్యూస్ 27 జనవరి మహబూబాబాద్ జిల్లా గార్ల మండల రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు గార్ల మండల మున్నేరు జలసాధన కమిటీ అధ్వర్యంలో మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మూడు తండ పూసలతండ లలో విస్తృత ప్రచారం నిర్వహించారు,గార్ల ఏజెన్సీ ప్రాంత అన్నదాతల శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జారీ చేసిన 1076 ఉత్తర్వులను అనుసరించి, మండలంలోని ముల్కనూరు పరిధిలో మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ పూసల తండ గ్రామంలో మండల మున్నేరు జలసాధన కమిటీ ఆధ్వర్యంలో, కమిటీ కన్వీనర్ గంగవత్ లక్ష్మణ్ నాయక్ నేతృత్వంలో చిన్న, సన్న కారు, అన్నదాతలతో సమావేశం ఏర్పాటుచేసి, అసంబద్ధ 98 ఉత్తర్వులపై జరగబోయే పరిణామాలను వివరిస్తూ, ఏజెన్సీ ప్రాంత రైతాంగానికి , ప్రజలకు నష్టం వాటిల్లే 98 జీవోను రద్దు చేయాలని కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్ నాయక్, కో కన్వీనర్స్, కమిటీ బాధ్యులు వివరించారు. జీవో 98 ద్వారా మున్నేరు నుండి 10 టిఎంసిల నీటిని పాలేరుకు తరలించే లింక్ కెనాల్ ను నిలుపుదల చేయాలని, దీంతో ఈ ప్రాంత రైతాంగం 3 వందల ఎకరాల వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుందని, సుమారు 55 అడుగుల లోతున మున్నేరు ప్యానల్ పాలేరు లింకు కెనాల్ కారణంగా ఈ ప్రాంత భూగర్భ జలాలు అడుగంటుతాయని, వ్యవసాయ పంటలకు నీటి కొరత ఏర్పడుతుందని మండలం ఎడారి ప్రాంతంగా మారుతుందని వారు ఆవేదనతో వివరించారు. మూడు తండా పూసల తండా వీధుల్లో బ్యానర్ చేతపుని ప్రదర్శన నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ.వో 98 ను రద్దు చేయాలని, ముల్కనూరు ప్రాంతంలో మున్నేరు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ విస్తృత ప్రచారంలో మండల మున్నేరు జలసాధన కమిటీ నాయకులు కందునూరి శ్రీనివాస్, ప్రముఖ లాయర్ జంపాల విశ్వ, జి సక్రు, పానుగంటి రాధాకృష్ణ, కత్తి సత్యం, అజ్మీర్ వెంకన్న, వాంకుడోత్ శ్రీకాంత్, గిన్నారపు మురళి తారకరామారావు ఎండి షఫీ యుద్దీన్. తదితరులు ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, అన్నదాతలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *